Telangana: మెడికల్ కాలేజీకి ముహూర్తం ఖరారు
సెప్టెంబర్ 15న సీఎం కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ మెడికల్ కళాశాలను స్టార్ట్ చేయనున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఈవిద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేశారు. కౌన్సెలింగ్ ద్వారా 100 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మరోవైపు కళాశాల భవనం, తరగతి గదులు, ల్యాబుల నిర్వహణ కోసం కొత్తపల్లిలోని విత్తనాభివృద్ధి సంస్థ గోదాముల స్థలాన్ని కేటాయించారు. హాస్టల్, లైబ్రరీ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చదవండి: Medical Education: జిల్లా ఆరోగ్య శాఖాధికారి సమావేశంలో శిక్షణ
కళాశాలకు అనుబంధంగా జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిని రెడీచేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో మెడికల్ హాబ్‌గా మారనుంది. హైదరాబాద్ మహానగరాలకు దీటుగా ఇక్కడే వైద్యం లభించనుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవల కళాశాల, ఆసుపత్రి నిర్వహణకు సరిపడ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ సిబ్బందిని కళాశాలకు కేటాయించింది. కాగా.. సెప్టెంబర్ 15 నుంచి పూర్తిస్థాయి తరగతలు ప్రారంభిస్తున్నట్లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
చదవండి: AP Medical College's: రాష్ట్రంలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలలు