Teaching & Non Teaching Jobs: అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన ఆనందంలో ఉన్న వీఎస్‌యూ బృందానికి ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం మరో తీపి కబురులాంటింది. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయపోవడం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖాళీల మొత్తం భర్తీకి ముందుకు రావడంతో అధ్యాపకులు, విద్యార్థులు
చదవండి: Faculty Jobs: విశ్వవిద్యాలయంలో 205 పోస్టులు.. దరఖాస్తు రుసుము ఇలా..
సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. తొలుత నెల్లూరు నగరంలో ప్రారంభం కాగా, సొంత భవనాల్లో వీఎస్‌యూ నిర్మాణానికి వెంకటాచలం మండలం కాకుటూరులో 83 ఎకరాలు కేటాయించారు. దివంగత నేత వైఎస్సార్ మరణానంతరం అప్పటి ప్రభుత్వాలు వీఎస్‌యూ గురించి పట్టించుకోక పోవడంతో అరకొర వసతులతో 2017లో కాకుటూరులోని సొంత భవనాల్లోకి మార్చారు. వీఎస్‌యూ అభివృద్ధిని విస్మరించిన పాలకులు, వీఎస్‌యూలో పోస్టుల భర్తీ గురించి కూడా పట్టించుకోలేదు. దీంతో ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో నెట్టుకొస్తూ వచ్చారు. ప్రస్తుతం వీఎస్‌యూలో అధ్యాపక, అధ్యాపకేత సిబ్బంది మొత్తం కలిపి 300 మంది ఉండగా, 1200 మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలని గత ప్రభుత్వం హయాంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక దఫాలు వీఎస్‌యూ వద్ద ఆందోళనలు చేపట్టినా పట్టించుకోలేదు.
తీరనున్న అధ్యాపకుల కొరత
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఎస్‌యూ రూపురేఖలు మారిపోయాయి. ఆసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తిచేయడంతో పాటు కొత్త భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. ఫలితంగా ఇటీవల న్యాక్ బృందం వీఎస్‌యూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడంతో న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో వీఎస్‌యూలో అధ్యాపకుల కొరత పూర్తిగా తీరనుంది. వీఎస్‌యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు కొత్తగా రెగ్యులర్, బ్యాగ్‌లాగ్ కలిపి 106 ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీతో వీఎస్‌యూలో అధ్యాపక, అధ్యాకేతర సిబ్బంది సమస్య పూర్తిగా తీరిపోతుందని అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Faculty Jobs: ఎస్‌వీఐఎంఎస్ మెడికల్ సైన్సెస్, తిరుపతిలో 100 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం వీఎస్‌యూలో తీరనున్న ఏళ్లనాటి సమస్య విక్రమ సింహపురిలో భర్తీకానున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది
ఖాళీలు మొత్తం భర్తీ
విక్రమ సింహపురి యూనివర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమస్య చాలా ఏళ్ల నుంచి ఉంది. వర్సిటీల్లో పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం సంతోషకరం. పోస్టుల భర్తీతో వీఎస్‌యూలో పూర్తిస్థాయిలో అధ్యాపక, అధ్యాపకేత సిబ్బంది రానున్నారు.
పి.రామచంద్రారెడ్డి, రిజిస్ట్రార్