Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. అర్హతలు ఇవే..
ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరిగే ఈ జాబ్‌మేళాలో 15 ప్రైవేటు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై వారి కంపెనీల్లోని ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తారన్నారు.
వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీ జెడ్ ఫిన్సర్వ్, రిలయన్స్ జియో, సంతోష్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, మెడ్ ప్లస్, ఆదిత్య ఫార్మసీ, ముత్తూట్ ఫైనాన్స్, హెటిరో, జెన్యూన్ సెక్యూరిటీ సర్వీస్, నోవాటెల్, అరబిందో, ఆయుష్ ఆస్పత్రి, స్పందన స్ఫూర్తి సర్వీసెస్ మొదలైన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఇన్ మెకానిక్స్‌తో పాటుగా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు గల వారు ఈ జాబ్‌మేళాకు అర్హులని వివరించారు. బయోడేటా, విద్యార్హతా పత్రాలు వాటి జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డుతో నేరుగా జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు 81424 16211లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.