Skip to main content

Mega Job Mela: 1256 మందికి ఉద్యోగాలు

Mega Job Mela  Employment Opportunities

మల్కాపురం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జీవీఎంసీ 59వ వార్డులోని జింక్‌ ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆండాళమ్మ కళాశాలలో ఏపీ సూక్ష్మ, చిన్న మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, పార్టీ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ ప్రభుత్వ సలహాదారుడు మిలీనియం శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది.

ముందుగా ఈ మేళాను వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించారన్నారు. వలంటీర్‌ వ్యవస్థతో మరో రెండు లక్షల మందికి ఉపాధి చూపారన్నారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలతో పాటు పలు పరిశ్రమలను తీసుకొస్తూ మరికొంత మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు ఇంటికొక ఉద్యోగమని చెప్పి మోసం చేశారని, నిరుద్యోగ భృతి ఇస్తామని చేతులెత్తేశారని విమర్శించారు. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా సేవలు అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని, అలాంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రి అయితే మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇంత చక్కటి మెగా జాబ్‌మేళా నిర్వహించి యువతకు ఉపాధి కల్పనకు చొరవ చూపిన ఆడారి ఆనంద్‌కుమార్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించిన పలువురికి ఆయన నియామక పత్రం అందజేశారు. పశ్చిమ సమన్వయకర్త ఆడారి మాట్లాడుతూ తొలి రోజు ఊహించని విధంగా మంచి స్పందన లభించిందన్నారు. ఈ మేళాలో వివిధ కంపెనీల్లో సుమారు 1256 మంది ఉద్యోగాలు పొందారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కలిదిండి బద్రినాథ్‌, పార్టీ పశ్చిమ పరిశీలకుడు ఎస్‌.ఎ.రెహమాన్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పుర్రె సురేష్‌, పలు వార్డుల కార్పొరేటర్లు పి.వి.సురేష్‌, బల్లా లక్ష్మణరావు, కొణతాల సుధ, గులిగిందల లావణ్య, గుండపు నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Free Coaching for Group 2: ఉచితంగా గ్రూప్‌–2 కోచింగ్‌.. చివ‌రి తేదీ ఇదే..

Published date : 04 Dec 2023 10:14AM

Photo Stories