Jobs in Reliance Company: రిలయన్స్ కంపెనీలో ఉద్యోగాలు
Sakshi Education
తిరుపతిలోని ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ టి.శ్రీనివాసులు తెలిపారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, గ్లోబల్ భారత్, మెగా మెడికల్స్ అండ్ సర్జికల్స్ కంపెనీ ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొని సుమారు 150 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ, ఎమ్ ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు మేళాకు హాజరుకావచ్చన్నారు. వివరాలకు 7989810194, 8790503630 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 15 Nov 2023 08:32PM