Job Mela: రేపు జాబ్‌మేళా
Sakshi Education
కడప కోటిరెడ్డి సర్కిల్: ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 18–35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పది నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బి.ఫార్మసీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు రావచ్చునని తెలిపారు. ఆసక్తిగల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Published date : 05 Oct 2023 07:57PM