Job fair in Govt ITI: 6న ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా
విజయనగరం అర్బన్: పట్టణంలోని మహిళా ప్రాంగణం దరిలోని ఐటీఐలో ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారిణి డి.అరుణ తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఆర్గనైజేన్, గాయత్రి ఆస్పత్రి, ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీల్లో వివిధ కేడర్లలో 106 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆయా సంస్థల ప్రతినిధులు చేపడతారని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఆర్గనైజేషన్‌లో బిజెనెస్ డవలప్మెంట్ మేనేజర్ 10 (పర్మినెంట్) పోస్టులకు రూ.22 వేల నుంచి రూ.35 వేల వేతనం ఉంటుందని ఈ పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాలలోపు వయసుతో ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఆ ఫైనాన్స్ కన్సల్టెంట్ 50 (టెంపరరీ) పోస్టులకు రూ.15 నుంచి రూ.40 వేల వరకు గౌరవ వేతనం ఉంటుందని, ఈ పోస్టులకు 60 సంవత్సరాలలోపు వయసుతో పదో తరగతి విద్యార్హత ఉండాలని తెలిపారు. గాయత్రి ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సు 11 పోస్టులకు రూ.8,500 నుంచి రూ.10 వేల వేతనం ఉంటుందని ఈ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల వయసులోపు ఉన్న ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం/బీఎస్‌సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న సీ్త్రలు మాత్రమే అర్హులను తెలిపారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌లో బ్యాంక్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ 35 పోస్టులకు రూ.14,500 వేతనం ఉంటుందని, ఈ పోస్టులకు 35 సంవత్సరాలలోపు వయసున్న ఇంటర్/ఏదైనా డిగ్రీ విద్యార్హత అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ‘ఎన్‌సీఎస్.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లోని జాబ్ సీకర్ లాగిన్ చేసుకోవాలని తెలిపా రు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రాంగణానికి తమ బయోడేటాను, రెండు పాస్‌ఫో టోలతో నేరుగా హాజరు కావాలని సూచించారు.
చదవండి: Andhra Pradesh: మూడు పరిశ్రమలు.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు