Skip to main content

Income Tax Department jobs: 10వ తరగతి అర్హతతో Income Tax Department లో ఉద్యోగాలు... నెలకు జీతం 56,900

income tax department jobs
income tax department jobs

ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుండి పదో తరగతి అర్హతతో క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది..అప్లై చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ 6వ తేదీన పరీక్ష నిర్వహించి పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Monthly 1Lakh salary Contract jobs: Click Here
 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ తమిళనాడు మరియు పాండిచ్చేరి రీజియన్ నుండి విడుదలైంది. 

భర్తీ చేస్తున్న పోస్టులు: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో క్యాంటీన్ అటెండిట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.

అర్హత: 10వ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

మొత్తం ఖాళీల సంఖ్య: మొత్తం ఖాళీల సంఖ్య – 25

వయస్సు: నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు.

వయస్సులో సడలింపు: క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.


అప్లికేషన్ ప్రారంభ తేదీ: 08-09-2024

అప్లికేషన్ చివరి తేదీ: 22-09-2024

హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీలు: అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయవచ్చు.

పరీక్ష తేదీ: 06-10-2024

అప్లికేషన్ విధానం: ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

జీతము: ఎంపికైన వారికి Level 1 ప్రకారం 18000/- నుండి 56,900/- వరకు జీతం ఇస్తారు .

ఎంపిక విధానం: 

ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 
ఒక పోస్ట్ కి 20 మంది చొప్పున మొత్తం 500 మందికి పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులకు ఇస్తారు. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటిలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు వస్తాయి.

ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి.  ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

పరీక్షా కేంద్రాలు: చెన్నైలో లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 

పోస్టింగ్ ప్రదేశం: తమిళనాడు మరియు పాండిచ్చేరి లో ఇస్తారు. 

Published date : 21 Sep 2024 10:02PM
PDF

Photo Stories