IT Crisis: పాపం అయ్యా పిచాయ్... నిండు గర్భిణిలకూ షాక్ ఇస్తే ఎలా
తాజాగా గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారికి పింక్ స్లిప్ జారీ చేస్తూ ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఈమెయిల్స్ పంపారు. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఓ నిండు గర్భిణి కూడా ఉంది.
ఉద్యోగం నుంచి తొలగించడం బాధగా ఉంది
గూగుల్ ఫైర్ చేసిన ఉద్యోగుల్లో ప్రోగ్రామ్ మేనేజర్ కేథరీన్ వాంగ్ ఒకరు. ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తిన సంస్థ.. ఆ మరోసటి రోజు లేఆఫ్స్ ప్రకటించి అగాధంలోకి నెట్టిందని ఆమె తన బాధను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. ‘‘ సంస్థ నుంచి టెర్మినేషన్ లెటర్ రావడంతో నేనెందుకు? ఇప్పుడెందుకు అనే ప్రశ్నలు నా మదిలో మెదిలాయి.
చదవండి: 11 వేలమందికి మైక్రోసాఫ్ట్ టాటా
ఇలాంటి సిచ్యూవేషన్స్‌ను జీర్ణించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా నా పనితీరు బాగుందని రివ్యూ ఇచ్చిన వెంటనే ఫైర్ చేయడం బాధాకరంగా ఉంది. నేను నిర్వహించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇక లేఆఫ్స్‌తో 34 వారాల గర్భిణిగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, నెలల తరబడి ప్రసూతి సెలవుపై వెళ్లడం దాదాపూ అసాధ్యం’’ అని కేథరిన్ వాంగ్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఒంట్లో వణుకు పుడుతోంది..
‘ నా బిడ్డ క్షేమం గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించ లేకపోతున్నాను. ఎందుకంటే నా గర్భంలో ఉన్న శిశువును జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉద్యోగం పోవడంతో వణుకుతున్న నా చేతుల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా’నంటూ విచారం వ్యక్తం చేస్తోంది.
చదవండి: దినదినగండంలా ‘‘ఐటీ’’ ఉద్యోగాలు...!
బట్... ఐ లవ్ గూగుల్
‘‘ నేను ఇప్పటికీ గూగుల్‌ను ప్రేమిస్తున్నాను. గూగుల్‌ను నేను ఒక కుటుంబంగా భావిస్తా. ఉద్యోగంలో టీం సహచర ఉద్యోగులకు, నాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇన్నేళ్లు గూగుల్‌లో పనిచేయడం గర్వంగా ఉందని వాంగ్ తన పోస్ట్‌ను ముగించారు. ప్రస్తుతం వాంగ్ లాంటి వారు ఎన్నో వేల మంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో పడిపోతున్నారు.