Silent Layoffs: సైలెంట్ లేఆఫ్స్.. 20000 మంది టెకీ ఉద్యోగాలు ఇంటికి..!
ఈ కారణంగా లక్షలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.
భారత్‌లో 20,000 మంది ఉద్యోగుల తొలగింపు..
ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం, 2023లో భారతదేశ ఐటీ రంగంలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను 'సైలెంట్ లేఆఫ్' విధానంలో తొలగించారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయి. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఈ జాబితాలో ముందున్నాయి.
'సైలెంట్ లేఆఫ్' అంటే ఏమిటి?
'సైలెంట్ లేఆఫ్' అనేది అప్రకటంగా ఉద్యోగులను తొలగించే పద్ధతి. ఇందులో కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి ఉంటాయి.
Job Layoffs: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు!!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రావడం, ఐటీ రంగంలో పెరుగుతున్న పోటీ, కృత్రిమ మేధస్సు (AI) వంటి కొత్త సాంకేతికతల వాడకం పెరగడం వంటి అనేక కారణాల వల్ల ఈ ఉద్యోగాల తొలగింపులు జరుగుతున్నాయి.