Skip to main content

Teacher Jobs: 283 టీచర్‌ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) ద్వారా సాధారణ ఉపాధ్యాయ ఖాళీలతోపాటు ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Teacher
Teacher

ఇన్నాళ్లు ఉపాధ్యాయ నియామక పరీక్ష ఉంటుందా? లేదా? అన్న మీమాంస నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

కొండాపూర్‌(సంగారెడ్డి): జిల్లాలో 1,265 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక 863, ప్రాథమి కోన్నత 191, ఉన్నత పాఠశాలలు 211 ఉన్నాయి. కాగా 682 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యాశాఖ మాత్రం 283 ఖాళీలను మాత్రమే భర్తీ చేయనుంది. ప్రకటనను చూస్తే జిల్లాలో ఇప్పటికే మంజూరై ఉన్న అన్ని పోస్టులను కూడా భర్తీ చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.

 

ఇవి గుర్తుపెట్టుకో.. గురుకులం ఉద్యోగం కోట్టుకో..| Dr Moses | TS Gurukulam Jobs 2023 Exam Day Tips

సర్దుబాటుతో వెళ్ల దీస్తూ

జిల్లాలోని 1,265 పాఠశాలలకు గానూ అనేక చోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం జిల్లావ్యాప్తంగా 220 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేవలం ఒకసారి మాత్రమే టీఆర్‌టీ ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేపట్టిన ఫలితం లేకపోయింది.

 

TS & AP DSC 2023 సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్ ఇవే.. | ఇలా చ‌దివితే 'టీచ‌ర్‌' ఉద్యోగం మీదే..|Teacher Jobs

ఏళ్లుగా నిరీక్షణ

గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన 2017లో టీఆర్‌టీ నిర్వహించారు. ఆ తరువాత ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడంతో ప్రభుత్వం ఎలాగైన టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తుందనే ఆశతో ప్రతి సంవత్సరం బీఎడ్‌, డీఎడ్‌ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. టీఆర్‌టీ పరీక్ష రాయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) అర్హత సాధించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఇటీవల టెట్‌ నోటిఫికేషన్‌ సైతం విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15న టెట్‌ అర్హత పరీక్ష, ఫలితాలు 27న ప్రకటించనుంది.

ఇవి చ‌దివితే చాలు..TET 2023లో టాప్ మార్కులు మీకే ! | TS TET Exam Pattern & Eligibility ఇలా..| Dr Moses

ఉపాధ్యాయ ఖాళీల వివరాలు

  • పోస్టులు ఖాళీలు భర్తీ చేస్తున్నవి
  • ఎస్‌ఏ 286 80
  • ఎస్‌జీటీ 385 174
  • ఎల్‌పి 24 24
  • పీఈటీ 5 5
  • మొత్తం 682 283
Published date : 31 Aug 2023 05:58PM

Photo Stories