Free training: యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు
Sakshi Education
అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సెంటర్ మేనేజర్ రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం యాంబర్ ప్రాజెక్టు తరఫున 45 రోజుల పాటు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ సేల్స్ అసోసియేట్ జాబ్‌రోల్స్, కంప్యూటర్ శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనా శిక్షణ ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత వెంటనే స్థానిక రాజురోడ్డులో ఉన్న కౌశల్ కేంద్రంలో సంప్రదించాలన్నారు. వివరాలకు సెల్: 93981 54460, 7569659964లో సంప్రదించాలని తెలిపారు.
Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation
Published date : 02 Sep 2023 05:31PM