Higher Education Institutions: ఉన్నత విద్యా సంస్థల్లో వీరికి 5 శాతం రిజర్వేషన్లు
కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కాకుండా ఎయిడెడ్ సంస్థల్లో కూడా ఈ మేరకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘పర్సన్ విత్ డిజేబిలిటీస్–2016’చట్టానికి అనుగుణంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పింది.
సీట్ల కేటాయింపులో కనీసం 5 శాతం రిజర్వేషన్ల అమలుతోపాటు కోర్సు ప్రవేశాల్లో వయోపరిమితిని ఐదేళ్లు సడలించాలని ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: Backlog Job Vacancies: దివ్యాంగుల పోస్టులకు 29లోగా దరఖాస్తు చేసుకోండి
హర్షణీయం: ముత్తినేని వీరయ్య
ఉన్నత విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హర్షం వ్యక్తం చేశారు. వయోపరిమితిని కూడా 5 సంవత్సరాలు పెంచడం గొప్ప విషయమన్నారు.
జూన్ 26న ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం గత ప్రభుత్వంపై పదేళ్లపాటు పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కో సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతోందన్నారు.
Tags
- Higher Education Institutions
- 5% Reservation for Differently Abled
- Aided Educational Institutes
- Person with Disabilities 2016
- admissions
- Telangana Disabled Corporation
- Telangana News
- vakati karuna
- Muthineni Veeraiah
- Disability quota
- Government policy
- government policy update
- Accessibility rights
- sakshieducation