Job Fair: ఉద్యోగ మేళాలు నిర్వహించండి
కోలారు: జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలని జిల్లాధికారి అక్రం పాషా తెలిపారు. శుక్రవారం నగరంలోని బాలుర కళాశాలలో నిర్వహించిన ఉద్యోగమేళాను ప్రారంభించి మాట్లాడారు. తాలూకా కేంద్రాల్లో కూడా ఉద్యోగ మేళాలను నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. గతంలో ఉద్యోగాల కోసం కంపెనీలు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. అయితే నేడు కంపెనీలే నిరుద్యోగుల వద్దకు వచ్చి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు అందిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఇంచర గోవిందరాజులు మాట్లాడుతూ ప్రభుత్వాలు నిర్వహించాల్సిన ఉద్యోగ మేళాలను స్వయం సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలోని బాలుర జూనియర్ కళాశాలను మరింతగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఫస్ట్ సర్కిల్ సొసైటీ సంస్థాపకుడు జయరాం మాట్లాడుతూ దక్షిణ కర్ణాటకలో పరిశ్రమలు అధికంగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. తమ సొసైటీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తోందన్నారు. బాలుర కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసగౌడ, సొసైటీ అధ్యక్షుడు నందీష్ గౌడ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Junior Executive Jobs in AAI: 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రూ.13 లక్షల వార్షిక వేతనం