Skip to main content

Contract Jobs: కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.55 వేల వేతనం

Computer Operator Jobs in Andhra Pradesh, ongolu Urban - Job Vacancy: Computer Operator for Aspirational Block Programme in Yarragondapalem Mandal Praja Parishad, offering Rs. 55,000 per month.

ఒంగోలు అర్బన్‌: యాస్పిరేషనల్‌ బ్లాక్‌ (మండలం) ప్రోగ్రాం కోసం కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్న చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. యర్రగొండపాలెం మండల ప్రజా పరిషత్‌లో డేటా ఎంట్రీ, డేటా వ్యాలిడేషన్‌, డేటా ఎవెల్యూషన్‌ తదితర పనులు యాస్పిరేషన్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.55 వేల వేతనం ఉంటుందని తెలిపారు. 18 నుంచి 42 ఏళ్ల వయసు మధ్య ఉండి పీజీ, డేటా ఎనాలసిస్‌ ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌తో పాటు అనుభవం కలిగి ఉండాలని తెలిపారు.

చ‌ద‌వండి: Grama Ward Sachivalayam Jobs: గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల పోస్టులు.. ఇంటర్వ్యూల తేదీలు ఇవే..

15లోపు పీఎఫ్‌ వివరాలు పంపాలి
ఒంగోలు: జిల్లా ప్రజా పరిషత్‌ యాజమాన్య పరిధిలోని అన్ని పాఠశాలల డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్స్‌మెంట్‌ అధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయుల పీఎఫ్‌ వివరాలను జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయానికి నవంబర్ 15వ తేదీలోగా పంపాలని ఐఫియా రాష్ట్ర కౌన్సిలర్‌ పీవీ సుబ్బారావు ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం నుంచి సర్క్యులర్‌ కూడా అన్ని పాఠశాలలకు జారీ అయినందున హెచ్‌ఎంలు, ఎంఈవోలు సత్వరమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. తమ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల జెడ్పీ పీఎఫ్‌ చందాదారుల వివరాలతోపాటు ఇటీవల జరిగిన పదోన్నతులు, బదిలీల్లో ఇతర మండలాలకు, ఇతర ఉన్నత పాఠశాలలకు మారిన వారి వివరాలు కూడా పంపించి పీఎఫ్‌ ఖాతా పుస్తకాలు తదనుగుణంగా మార్పు జరిగేలా చర్యలు చేపట్టాలని, ఇప్పటి వరకు పీఎఫ్‌ షెడ్యూలర్స్‌ కూడా పంపాలని పేర్కొన్నారు.

చ‌ద‌వండి: Job Mela: 10న ఒంగోలులో జాబ్‌మేళా

రేపు ఎస్‌జీఎఫ్‌ బాక్సింగ్‌ సెలక్షన్స్‌
ఒంగోలు: అండర్‌ 14, అండర్‌ 17 బాక్సింగ్‌ క్రీడాకారుల ఎంపిక నవంబర్ 9న స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి కె.వనజ నవంబర్ 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపిక కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ 9052866392ను సంప్రదించాలన్నారు.

Published date : 08 Nov 2023 01:42PM

Photo Stories