Skip to main content

Agniveer recruitment: ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రాథమిక అర్హత పరీక్ష

అగ్ని వీరుల నియామకానికి నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్ష కోసం తెలంగాణ‌ రాష్ట్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
Agniveer recruitment

అయితే అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్దేశించిన పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాతనే ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా అభ్యర్థులకు హాల్‌ టికెట్లు పంపిస్తామని ఆర్మీ నియామక అధికారి కీట్స్‌ కె.దాస్‌ తెలిపారు. వివ‌రాల‌కు 79961 57222 నంబర్ కు వాట్సాప్ చేయాలని సూచించారు.

చ‌ద‌వండి: ఆర్మీలో  ఉద్యోగాలు.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు ఇలా అప్లై చేసుకోండి
ప్రారంభ‌మైన ద‌ర‌ఖాస్తులు...
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌ కింద నిర్వహించే అగ్నివీరుల నియామక పరీక్షకు నోటిఫికేషన్  ఇప్ప‌టికే విడుదలైన సంగ‌తి తెలిసిందే. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. రెండు దశల్లో చేపట్టే ఈ ఎంపిక ప్రక్రియలో మొద‌ట రాత పరీక్ష ఉంటుంది. అయితే ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హిస్తారు. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. వివ‌రాల‌కు joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Published date : 28 Feb 2023 05:48PM

Photo Stories