Skip to main content

Agniveer Jobs: అగ్నివీర్‌కు సైనిక్‌ స్కూల్‌ విద్యార్థుల ఎంపిక

ఖానాపురం: మండలంలోని అశోక్‌నగర్‌ గిరిజన సైనిక్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అగ్నివీర్‌కు ఎంపికై నట్లు కళాశాల డైరెక్టర్‌ ఎడ్ల శ్రీనివాసరావు తెలిపారు.
Agniveer Jobs
అగ్నివీర్‌కు సైనిక్‌ స్కూల్‌ విద్యార్థుల ఎంపిక

 ఈ సందర్భంగా సెప్టెంబ‌ర్ 26న‌ ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజన సైనిక్‌ స్కూల్‌లో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఏప్రిల్‌ 2023లో జరిగిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎంపికై న ట్లు తెలిపారు. విద్యార్థులు రాజు, భరత్‌, అనిల్‌, భరత్‌, నరేష్‌, సంతోష్‌ సెప్టెంబర్‌ 1 నుంచి 7వరకు ఖ మ్మంలో జరిగిన ర్యాలీ, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీ ర్ణత సాధించారని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 25 న విడుదల చేసిన జాబితాలో వారు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులకు డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌ శేరికుమార్‌, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Published date : 27 Sep 2023 05:04PM

Photo Stories