Agniveer Selections: అగ్నివీర్ ఎంపికపై విద్యార్థులకు అవగాహన
నాగర్‌కర్నూల్: యువత దేశానికి తరగని సంపద, ఆ యువత దేశ రక్షణలో ఉండి కాపాడేందుకు ముందుకు రావాలని, త్రివిధ దళాల ఒకటైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీరులు సైనికుల ఎంపికలో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఎయిర్‌ఫోర్స్, అగ్నివీర్ ఎంపికపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
World Water Day: కళాశాలలో జల దినోత్సవం వేడుక..
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వింగ్ కమాండర్ అనుప్రీతి మాట్లాడారు. విద్యార్థులు, యువకులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీరులు సైనికులు 3 రౌండ్‌లో ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లో పాల్గొని ఎన్‌సీసీ–సీ సర్టిఫికెట్ ఉంటే ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా దేశ రక్షణకు భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షాజహానాసుల్తానా, కమాండర్ సందీప్, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి పాండు తదితరులు పాల్గొన్నారు.
Tags
- airforce
- Agniveer
- understanding session
- Government Degree College
- Wing Commander Anupreeti
- Students
- Education News
- Sakshi Education News
- mahabubnagar news
- GovernmentDegreeColleges
- WingCommanderAnupreeti
- Nagarkurnool News
- YouthDevelopment
- NationalProtection
- GovernmentDegreeCollege
- AirForceSelection
- FiremenSelection
- EducationPrograms
- YouthEmpowerment
- CareerGuidance
- SakshiEducationUpdates