Skip to main content

Inspirational Story: 87 సంవత్సరాల వయసులో డిగ్రీ ప‌ట్టా.. కూతురు ప్రోత్సాహకంతోనే..

అరవై సంవత్సరాలు దాటాయంటే చాలామంది మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా తమ శేష జీవితాన్ని గడపాల‌నుకుంటారు. కానీ, శ్రీలంకకు చెందిన ఓ బామ్మ మాత్రం 87 ఏళ్ల వయసులో మాస్టర్స్‌ డిగ్రీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది.
వరత షణ్ముగనాథన్‌

‘ఈ వయసులో చదువు ఏమిటి!’ అనుకునేవాళ్లు ఒక్కసారి వరత షణ్ముగనాథన్‌ గురించి చదివితే– ‘అవును. నాకు కూడా చదువుకోవాలని ఉంది’ అని బలంగా అనుకుంటారు. 
కెనడాలోని ‘యార్క్‌ యూనివర్శిటీ’ నుంచి 87 సంవత్సరాల వయసులో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది వరత షణ్ముగనాథన్‌. విద్యారంగంలో ఆమె స్ఫూర్తిదాయకమైన కృషిని గుర్తించి గౌరవించింది ఆంటేరియో లెజిస్లేచర్‌ అసెంబ్లీ. షణ్ముగనాథన్‌ హాలులోకి అడుగు పెడుతున్న సమయంలో సభ్యులు లేని నిల్చొని జయజయధ్వానాలు చేశారు.

Varatha Shanmuganathan

Inspirational Story: ‘ఇన్పోసిస్‌’లో ఉద్యోగం వ‌దిలి.. మోటివేషనల్‌ స్పీకర్‌గా ఎదిగి..
‘ఈ తరానికి ఎన్నో రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే మహిళ’ అంటూ షణ్ముగనాథన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు అసెంబ్లీ సభ్యులు.
షణ్ముగనాథన్‌ కెనడాకు వెళ్లిన సమయంలో సీనియర్స్‌కు ‘యార్క్‌ యూనివర్శిటీ’లో మాస్టర్స్‌ డిగ్రీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుసుకొని ఎంతో సంతోషించింది. అలా మాస్టర్స్‌ ప్రోగ్రాంలో భాగం అయింది. కూతురు ఎంతోప్రో త్సాహకంగా నిలిచింది.
‘యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌’లో డిగ్రీ చేసిన షణ్ముగనాథన్‌ ‘యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌’లో ఫస్ట్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేసేనాటికి ఆమె వయసు యాభై సంవత్సరాలు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వరత షణ్ముగనాథన్‌ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చి వైరల్‌గా మారింది.
షణ్ముగనాథన్‌ను ప్రశంసిస్తూ అన్ని వయసులవారి నుంచి కామెంట్స్‌ వచ్చాయి. మచ్చుకు కొన్ని.. 
☛ ‘కాస్త వయసు పైబడగానే ఈ వయసులో ఏం నేర్చుకుంటాం అనే నిర్లిప్తత చాలామందిలో ఉంటుంది. ఇలాంటి వారిలో మార్పు తీసుకువచ్చే విజయం ఇది’
☛ ‘నేను ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. ఏదైనా చేయాలి.. అని ఆలోచించేవాడిని. అంతలోనే ఈ వయసులో ఏం చేస్తాములే అని వెనక్కి వెళ్లేవాడిని. వరతమ్మ వీడియో చూసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆమెలాగే నేను కూడా చదువుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను’.

Success Story : 70 ఏళ్ల‌లో ప‌ది పాస్‌.. ఈ పెద్దాయ‌న ఆశ‌యం ఏమిటంటే..

Published date : 16 Dec 2022 04:08PM

Photo Stories