Success Story : 70 ఏళ్లలో పది పాస్.. ఈ పెద్దాయన ఆశయం ఏమిటంటే..
Sakshi Education
చదవాలనే ఆశయం ఉండాలేగాని ఏ వయస్సులోనైనా చదవొచ్చు అని నిరూపించాడు ఓ వృద్ధుడు. 70 ఏళ్ల వయసులో పది పూర్తి చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన గాల్‌రెడ్డి అనే రైతు.
సర్పంచ్ కావాలనే ఉద్దేశంతో ఈ పెద్దాయన.. ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి విద్యను అభ్యసించారు.
2021–22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఫలితాలు విడుదల కాగా నవంబర్ 19న విద్యాశాఖ అధికారుల నుంచి ఉత్తీర్ణతా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలన్నది ఆయన కల. అయితే సర్పంచ్‌గా పోటీ చేసేందుకు పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. నా కలను నెరవేర్చుకునేందుకే పదో తరగతి పరీక్ష రాశానని గాల్‌రెడ్డి అంటున్నారు. మీరు గ్రేట్ పెద్దాయన అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంట్లోనే ఉండి చదివా.. సివిల్స్ కొట్టానిలా.. కానీ.. నా లక్ష్యం మాత్రం ఇదే..
Published date : 21 Nov 2022 02:51PM