Skip to main content

Zonal Level Competitions: సీఓఈ క‌ళాశాల‌లో క్రీడా పోటీలు

జోనల్‌స్థాయి క్రీడా పోటీల‌ను నిర్వ‌హించనున్న‌ట్లు జిల్లా ఆర్సీవో తెలిపారు. ఈ పోటీల్లో విజ‌యం పొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె తెలిపారు. ఈ పోటీల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను కూడా ఆమె వివ‌రించారు.
RCO and College Principal inspecting the play ground
RCO and College Principal inspecting the play ground

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ)లో ప్రప్రథమంగా జోనల్‌స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు సంక్షేమ గురుకులాల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి సీవోఈ కళాశాల క్రీడా మైదానాన్ని రీజినల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ సట్ల శంకర్‌, సంక్షేమ గురుకుల సీవోఈ ప్రిన్సిపాల్‌ సైదులు, కాసిపేట గురుకుల ప్రిన్సిపాల్‌ సంతోష్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.

Employees Strike: ఉద్యోగుల స‌మ్మేకు తాత్కాలిక విర‌మ‌ణ‌

ఈ సందర్భంగా ఆర్సీవో మాట్లాడుతూ.. అక్టోబర్‌ 13 నుంచి 16వ తేదీ వరకు జోనల్‌స్థాయి క్రీడాపోటీలు బెల్లంపల్లి సీవోఈలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. పోటీలకు కాళేశ్వరం జోన్‌ పరిధిలోని కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు జిల్లాల పరిధిలోని 11బాలుర గురుకులాలకు చెందిన 935 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు.

TSPSC Group 1 Prelims 2023 Cancelled : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు.. కార‌ణం ఇదే..

విద్యార్థులకు అండర్‌–14, 16, 19 విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. కబడ్డీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాల్‌ బాడ్మింటన్‌, హ్యాండ్‌ బాల్‌, టెన్నీ కాయిట్‌, ఖోఖో, చదరంగం, క్యారమ్స్‌, 100, 200, 400, 800, 1,500 మీటర్లు, ఐదు కిలో మీటర్ల పరుగుపందెం పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. షాట్‌ఫుట్‌, డిస్కస్‌ త్రో, లాంగ్‌జంప్‌, హైజంప్‌, రిలే విభాగాల్లోనూ పోటీలుంటాయని వివరించారు. జోనల్‌ స్థాయి విజేతలకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు వామన్‌, రాకేశ్‌, సంతోష్‌, శ్రీకాంత్‌, జేవీపీ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 23 Sep 2023 02:08PM

Photo Stories