US Spelling Bee 2024: 'స్పెల్లింగ్ బీ'లో సత్తా చాటిన తెలుగు విద్యార్థి.. ఎంత ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడంటే..
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్ తోపాటు 50 వేల డాలర్ల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు.
ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్‌కు చేరుకున్నారు.
Silent Layoffs: సైలెంట్ లేఆఫ్స్.. 20000 మంది టెకీ ఉద్యోగాలు ఇంటికి..!
ఇక వారిలో బృహత్ సోమకి, టెక్సాస్‌కు చెందిన పైజాన్ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు.
2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును బృహత్ బ్రేక్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్‌తో సత్తా చాటాడు.
UGC: డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్.. యూజీసీ సూచనలు ఇలా..
ఇక రన్నరప్‌గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్ పరీఖ్ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు.