Skip to main content

TTC Hall Ticket: వెబ్‌సైట్‌లో టీటీసీ హాల్‌టికెట్లు

TTC hall ticket on website  DEO B. Lingeswara Reddy announces availability of TTC lower grade theory exam hall tickets on website.

విజయనగరం అర్బన్‌: టీటీసీ లోయర్‌ గ్రేడ్‌ థియరీ పరీక్ష హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉన్నాయని డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీన రెగ్యులర్‌ అండ్‌ వన్స్‌ ఫెయిల్డ్‌ ప్రైవేట్‌ అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌లను ‘బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యేవారు ఫొటో ఐడెంటిటీగా పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలన్నారు.

చ‌ద‌వండి: Kakatiya University: 16న కేయూలో వర్క్‌షాప్‌

Published date : 14 Dec 2023 12:13PM

Photo Stories