TS Gurukulam Invites Applications For Admissions-బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024–2025 విద్యాసంవత్సరంలో 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,ఈబీసీలలో అర్హులైన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆ బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మనోహర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
వీళ్లు అర్హులు..
6వతరగతిలో ఖాళీసీట్లకు 2023–2024 సంవత్సరంలో 5వతరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులు, 7వతరగతిలో ప్రవేశాలకు అదే సంవత్సరం లో 6వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులు, 8వతరగతిలో ఖాళీ సీట్లకు 7వతరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులు అర్హులన్నారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్: ఎంజీపీ టీబీఈడబ్లూ ఆర్‌ఐఈఎస్ .తెలంగాణ .గౌట్.ఇన్
పరీక్ష తేది: 6,7,8 తరగతుల వారికి మార్చి3న
ఇతర వివరాలకు 040–23328266 నంబర్‌లో సంప్రదించండి
దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణసాంఘికసంక్షేమగురుకులవిద్యాలయాలసంస్థ టీఎస్‌డబ్లూఆర్‌ఈఐఎస్,టీటీడబ్లూఆర్‌ఈఐఎస్,ఎంజేపీబీసీడబ్లూఆర్‌ఈఐఎస్, టీఆర్‌ఈఐఎస్‌గురుకుల పాఠశాలల్లో ఈవిద్యాసంత్సరం 2024–2025లో ప్రవేశాలకుగాను దరఖాస్తులు చేసుకునేందుకు గడువును ఈనెల 20వతేదీ వరకు పొడిగించారని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికి ఈఏడాది ఫిబ్రవరి 11న ప్రవేశపరీక్ష ఉంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ మనోహర్‌రెడ్డ్డి తెలిపారు.