Tribal Students : గిరిజనులకు విలువిద్యలో శిక్షణ.. వీరి ఉన్నత విద్యకు..
అన్ని రాష్ట్రాల్లో ఆదివాసీలకు పూర్తిస్థాయి సదుపాయాలు కలి్పస్తామని, అటవీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆగస్టు 22వ తేదీన (సోమవారం) చింతపల్లిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. అల్లూరి దాడిచేసిన పోలీస్ స్టేషన్ ఆవరణలో సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి అనుచరుడు గంటం దొర మనుమడు బోడి దొరని ఘనంగా సత్కరించారు. వారి వారసులు 11 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. న్యాయవాది కరణం సత్యనారాయణరాజు ఆంగ్లంలో రచించిన ‘లెజెండరీ అల్లూరి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. గిరిజనులు ఆత్మాభిమానం కోసం ప్రాణాలు పణంగా పెడతారని చెప్పారు. అల్లూరి బ్రిటిష్ వారిపై విప్లవాగ్ని రగిలించడం గర్వంగా ఉందన్నారు. గిరిజనుల ఉన్నత విద్యకు 2014 నుంచి దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్ని ప్రారంభించామని, 740కి పైగా పాఠశాలలు నిరి్మస్తున్నామని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌ను రూ.12 కోట్ల నుంచి రూ.38 కోట్లకు పెంచామన్నారు. ఆదివాసీలకు దైవంతో సమానమైన చెట్టు, పుట్ట, భూమిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తుల్ని పెంచి, వాటి మార్కెటింగ్‌కు మోడల్ విలేజ్‌లు అభివృద్ధి చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అర్జున్ ముండా తెలిపారు.