Skip to main content

10th Class Exam Dates: టెన్త్‌ పరీక్షలు వాయిదా!

10th exams

10th Class Exams in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు వారం రోజులు వాయిదా పడనున్నాయి. మే 2 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలు మే 9 లేదా 13 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. టెన్త్, ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొన్ని ఒకే తేదీల్లో జరగనుండడమే దీనికి కారణం. జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ వల్ల ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

10th Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..

ఇంటర్‌ పరీక్షలు ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాలి. కానీ జేఈఈ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరిగేలా ఎన్టీఏ తేదీలను ప్రకటించడంతో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేశారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించారు. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మే 2 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఇంటర్, టెన్త్‌ పరీక్షలు కొన్నిచోట్ల ఒకే సెంటర్‌లో నిర్వహించాల్సి ఉంది.

అక్కడ టెన్త్‌ పరీక్ష కేంద్రాలను వేరేచోటుకు మార్చడానికి వీలుపడటం లేదు. ఇంటర్, టెన్త్‌ పరీక్షలు ఒకేసారి జరిగితే రెండిటి ప్రశ్నపత్రాలు, సమాధానాల బుక్‌లెట్లు, ఇతర పరీక్ష సామగ్రి భద్రపరిచేందుకు పోలీసు స్టేషన్లలో వసతి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రతకు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకానికి కూడా సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్‌ పరీక్షలను వారం రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మే 9నుంచి లేదా 13నుంచి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. 

చదవండి: 

పదో తరగతి స్డడీ మెటీరియల్‌

పదో తరగతి బిట్‌బ్యాంక్

పదో తరగతి సిలబస్

పదో తరగతి మోడల్ పేపర్లు

పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

పదో తరగతి టెక్స్ట్ బుక్స్

మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

Published date : 13 Mar 2022 12:09PM

Photo Stories