Skip to main content

Exams Arrangements: టెన్త్‌, ఇంటర్‌తోపాటు డీఎస్‌సీ, టెట్‌ పరీక్షలకు ఏర్పాట్లు..

టెన్త్‌ ఇంటర్‌ పరీక్షతోపాటు మార్చిలో టెట్‌, డీఎస్‌సీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అభ్యర్థులకు కావాల్సిన సదుపాయాలను, అ‍న్ని విధాల చర్యలను తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్‌..
Exams arrangements for tenth, inter, TET, DSC

కర్నూలు(సెంట్రల్‌): ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలిపారు. గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పది, ఇంటర్‌, టెట్‌, డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌తో కలసి విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌ సృజన వివరించారు.

Technical Courses Exams: టెక్నికల్‌ కోర్సులకు పరీక్షలు తేదీలు ఇవే..

డీఎస్సీతోపాటు టెట్‌, ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకముందు విద్యాశాఖమంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల సమయంలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ జి.కృష్ణకాంత్‌, డీఈఓ శామ్యూల్‌, ఆర్‌ఐఓ గురవయ్యశెట్టి, డీవీఈఓ జమీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Published date : 23 Feb 2024 04:13PM

Photo Stories