Skip to main content

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం..

సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
Andhra Pradesh
Andhra Pradesh

ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్‌, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది. 

Russia/Ukraine War: తెలుగు విద్యార్థుల క‌ష్టాలు.. నిత్యావసరాలు ఖాళీ, ఫ్లైట్స్‌ లేవు.. చివ‌రికి..

సహాయ చర్యలను..
గత ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ గంగ ప్రాజెక్టు ద్వారా భారతీయ విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తరలించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీణ్‌ శేఖరప్ప ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో మంగళవారం ఉదయం చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది.

KTR: ఖర్చులు మేమే భ‌రిస్తాం.. మా స్టూడెంట్స్‌ని త్వరగా తీసుకురండి..

MBBS: ఇక‌పై విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఈ నిబంధ‌న‌లు పాటించాల్సిందే..!

Telugu Students : విద్యార్థుల‌ను క్షేమంగా రప్పించడంపై సీఎం వైఎస్‌ జగన్ స‌మీక్ష

 

 

Published date : 02 Mar 2022 03:55PM

Photo Stories