Telugu Students : విద్యార్థులను క్షేమంగా రప్పించడంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ మేరకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని జైశంకర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను ముందుగా పక్కదేశాలకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తెలుగువారిని క్షేమంగా రప్పించడంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష :
ఇదిలా ఉండగా.. జైశంకర్‌కు ఫోన్ చేసే ముందు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని భద్రంగా రప్పించడంపై సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో ఫిబ్రవరి 25వ తేదీన(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.
కాల్‌సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశం..
అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్ కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలని, కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సీఎం పేర్కొన్నారు.
ప్రత్యేక విమానాల ద్వారా..
ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రికి కూడా సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
APNRTS హెల్ప్‌లైన్ నెంబర్: 0863-2340678
ఏపీ హెల్ప్‌లైన్ వాట్సాప్ నెంబర్ +918500027678
ఢిల్లీలో సంప్రదించాల్సిన అధికారులు:
శివ శంకర్- 9871999055
రామారావు-9871990081
సాయిబాబు- 9871999430
న్యూఢిల్లీ, తెలంగాణ భవన్‌కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు
విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ : 7042566955
చక్రవర్తి, పీఆర్వో: 9949351270
నితిన్, ఓఎస్‌డీ: 9654663661
తెలంగాణ సెక్రటేరియట్, హైదరాబాద్ హెల్ప్ లైన్ నెంబర్లు
చిట్టిబాబు, ఏఎస్‌వో: 040-23220603
: 9440854433
ఈమెయిల్ ఐడీ: so_nri@telangana.gov.in