Teaching methods: లో కాస్ట్, నో కాస్ట్ బోధన
Sakshi Education
కాళోజీ సెంటర్: విద్యార్థుల్లోని సామర్థ్యాలను వెలికి తీసేందుకు బోధన విధానాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి ఉపాధ్యాయులకు సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి గణితం, జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులకు వరంగల్‌లో నిర్వహిస్తున్న ఉన్నతి శిక్షణ తరగతులు బుధవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తరగతులను పరిశీలించి ఆమె మాట్లాడుతూ గణితంపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించాలని సూచించారు. లో కాస్ట్, నో కాస్ట్ బోధన ఉపకరణాలను ఉపయోగించి విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి కలిగించాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ జి.కృష్ణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, కోర్సు డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు శ్రీనిధి, శారదాబాయి, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు ఎండీ.అజిత్, లోకేష్, ఆనంద్‌బాబు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
AP Third Place in Training & Employment to Rural Youth @SakshiBhavita
Published date : 31 Aug 2023 04:58PM