Skip to main content

Inspiring Mother Daughter: తీవ్ర‌ రోడ్డు ప్ర‌మాదానికి గురైనా విద్యార్థిని.. అయినా ప‌రీక్ష‌లో 90 శాతం..!

ఎన్ని బాధ‌లు వ‌చ్చినా ముందుకు న‌డిచే ధైర్యం ఉంటే ఎన్ని గ‌మ్యాల‌నైనా చేర‌వ‌చ్చు. ఈ మాట‌ల‌ను నిరూపించారు ఈ త‌ల్లీకూతుర్లు. అస‌లు క‌థేంటో చూద్దాం..
A Mother's resignation for Daughter's success

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నివేదిత చౌదరి అనే అమ్మాయి మీరట్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థిని. 12వ తరగతి చ‌దువుతోంది. 2014లో ఒక రోజు ఆమె తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్ర‌మాదంలో ఆమెకు తోడుగా త‌న తండ్రి కూడా ఉన్నాడు. ప్ర‌మాదంలో ఆమె కోమాలోకి పోయి జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయింది. ఇదిలా ఉంటే, త‌న తండ్రి విశాల్ చౌద‌రీ ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు.

Doctor to Collector: డాక్టర్ నుంచి కలెక్టర్‌గా మారిన యువతి..

టీచ‌ర్‌ ఉద్యోగం చేస్తున్న త‌న త‌ల్లికి ఈ విష‌యం తెలిసి త‌న కుతురిని చూసుకునేందుకు చాలా రోజుల‌పాటు సెల‌వులు కావాల్సి ఉండ‌డంతో సెల‌వుల‌కు బ‌దులుగా ఉద్యోగానికి రాజీనామా ప‌లికింది. నివేదిత త‌న జీవితంలో మొత్తంగా ఏడాది పాటు కోమాలో ఉంది. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌ట్టికి త‌న‌కు తానుగా అన్ని ప‌నులు చేసుకోవ‌డానికి క‌నీసం తొమ్మిది నెలలు ప‌ట్టింది. ఆ తొమ్మిది నెల‌లు ఒక‌రి స‌హ‌కారం లేనిది ఏ పని అయ్యేది కాదు. ఇటువంటి స్థితిలో ఉన్న త‌న కూతురి ఆరోగ్యం త్వ‌ర‌గా మెరుగ‌వ్వాల‌ని కూతురితోనే ఉంటూ త‌న‌ని కంటికి రెప్ప‌లా చూసుకుంది.

Civils Top Rankers: సివిల్స్‌లో ర‍్యాంకు సాధించి ప్రధాని ప్రశంసలు అందుకున్న విద్యార్థులు వీరే..

త‌న భ‌ర్త మ‌ర‌ణంతో నివేదిత బాధ్య‌త‌లు తానే తీసుకొని త‌న‌ని అన్ని విధాలుగా ముందుకు న‌డిపించాల‌నుకుంది. త‌న జ్ఞాప‌క‌శ‌క్తిని సైతం కోల్పోవ‌డంతో అన్నింటినీ క్ర‌మంలో గుర్తు ప‌ట్టించి విద్యలో కూడా ముందుండాల‌ని ప‌రీక్ష‌కు సైతం సిద్ధం చేసింది త‌న త‌ల్లి. కోమా నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చాక త‌న సీబీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు త‌న త‌ల్లి త‌న‌ను సిద్ధం చేసింది. త‌న జ్ఞ‌ప‌కశ‌క్తిని సైతం వెనక్కి తెచ్చింది. 

నివేదిత త‌ల్లిగా తాను చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించాలంటే త‌న నివేదిత కూడా అందుకు తగ్గిన శ్రమ పెట్టాలి. ఈ విష‌యంలో నివేదిత ఏమాత్రం వెన‌క్కి అడుగు వేయ‌లేదు. త‌ల్లికి త‌గ్గిన కూతురు అనేలా శ్ర‌మించి త‌న ప‌రీక్ష‌ల‌కు చ‌దివి ఓ రైట‌ర్ స‌హ‌కారంతో ప‌రీక్ష‌ను పూర్తి చేసింది. చివ‌రికి త‌న ప‌రీక్ష‌ల్లో  90.4 శాతం మార్కుల‌ను సాధించింది.

Padmaja Kumari Parmar Success Story : రూ.50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి.. అయినా కూడా ఇలాంటి ప‌నులు చేస్తోంది..!

గెలుపుపై నివేదిత మాట‌లు..
 
ఈ నేపథ్యంలో అందరూ నివేదిత‌ను అభినందించారు. ఇందులో భాగంగా నివేద‌త మాట్లాడుతూ.. 'నేను ఫ్యాషన్ డిజైనింగ్' చేయాలనుకుంటున్నాను అని ఆమె తెలిపింది. తన విజయానికి తన తల్లే కారణమని తెలిపింది. నివేదితకు ఆమె తల్లి నళిని కథలు, స్కూల్ సబ్జెక్స్ గురించి అవిఇవీ చెప్పి ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి పునరుద్ధరించింది.

Success as Collector: క‌లెక్ట‌ర్‌గా విజ‌యం సాధించిన గిరిజ‌న విద్యార్థి

అయినా కాని, త‌న కూతురి కోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వీడి నివేదిత‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంది. అలా, త‌న చ‌దువుకు ఈ త‌ల్లి తోడై కుమార్తె చేరిన గ‌మ్యానికి కార‌ణ‌మైంది. ఈ విధంగా ఇద్ద‌రు తల్లికూతుర్లు త‌మ జీవితంలో జరిగిన ఇంత‌టి విషాదాన్ని సైతం జ‌యించి ముంద‌డుగు వేసి గ‌మ్యానికి చేరారు. ప్ర‌స్తుతం అంద‌రి అభినంద‌న‌లు గెలిచారు.
 

Published date : 11 Dec 2023 09:23AM

Photo Stories