Students Struggle : బడి దూరానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..
జి.కొండూరు: పొట్ట కూటి కోసం గత నాలుగు దశాబ్దాల క్రితం ఒడిశా రాష్ట్రం నుంచి వలస వచ్చి జి.కొండూరు మండల పరిధిలోని గడ్డమణుగు లోయ ప్రాంతంలో 65 కుటుంబాలు రెండు క్యాంపులుగా నివాసం ఉంటున్నాయి. అయితే వీరి పిల్లల చదువుల కోసం గతంలో ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేసినప్పటికీ తర్వాత తొలగించారు. దీంతో ఇక్కడ పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే చెర్వుమాధవరం, గడ్డమణుగు వరకు నాలుగు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాలి.
Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు.. చివరి తేదీ ఇదే
అటవీ ప్రాంతం కావడంతో పాటు దారి మధ్యలో రైల్వే ట్రాక్ కూడా ఉండటంతో పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 40 మందికి పైగా పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్న ఇక్కడ, మూడొంతుల మంది పాఠశాలకు వెళ్లకుండా క్యాంపులలోనే ఉండిపోతున్నారు. అంతే కాకుండా ఇక్కడ ఉన్న చిన్నారులకు ఆధార్ కార్డులు సైతం లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు కూడా దూరమవుతున్నారు.
SSLV D-3: ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 ప్రయోగం సక్సెస్.. కక్ష్యలోకి సురక్షితంగా..
నెలకు రూ.1500వరకు ఆటో ఖర్చు..
పిల్లలను పాఠశాలకు పంపాలంటే ఆటో ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.1200 నుంచి రూ.1500వరకు చెల్లించాల్సి రావడంతో ఖర్చు భారమై పిల్లలను పాఠశాలకు పంపేందుకు కూడా ఆ కుటుంబాలు నానా తంటాలు పడుతున్నాయి. తాము రోజు మొత్తం కూలీ పనులకు వెళ్తే రూ.300 నుంచి 500 మాత్రమే వస్తాయని, అవి తమ కుటుంబ పోషణకు కూడా సరిపోవడంలేదని ఆయా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కొండపల్లిలో కూడా..
అదేవిధంగా కొండపల్లి గ్రామ శివారులోని క్వారీలలో పని చేస్తున్న కుటుంబాల పిల్లలకు అక్కడ 7వ తరగతి వరకు పాఠశాలను ఏర్పాటు చేసినప్పటికీ 8, 9, 10 తరగతులు చదివే పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. అక్కడ సైతం మొత్తం 45మంది వరకు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నప్పటికీ, 15 మంది వరకు 8నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు రోజూ 5కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
10th & Inter: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫీజు గడువు చివరి తేదీ ఇదే..
అంగన్‌వాడీ కేంద్రం లేక..
ఒడిశాకు చెందిన 65 కుటుంబాలు రెండు క్యాంపులుగా ఏర్పడి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని గత నలభై ఏళ్లకు పైగా నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబాలకు చెందిన చిన్నారుల కోసం ఒక క్యాంపులో అంగన్‌వాడీ కేంద్రం భవనం ఏర్పాటు చేసినప్పటికీ మరో క్యాంపులో భవనం లేకపోవడంతో చిన్నపాటి తాటాకుల పందిరి కిందనే అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
పాఠశాల లేక విద్యార్థుల అవస్థలు గడ్డమణుగు లోయను పట్టించుకోని విద్యాశాఖ అధికారులు పాఠశాలను ఏర్పాటు చేయాలి
Govt Diploma Colleges : ప్రభుత్వ డిప్లొమా కళాశాలల్లో జాబ్ మేళా..
మా పిల్లల చదువుల కోసం మా క్యాంపు దగ్గరే పాఠశాలను ఏర్పాటు చేయాలి. నాకు ముగ్గురు కూతుర్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులు ముప్పై ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆటో ఖర్చులు భారమవుతున్నాయి.
– ప్రసన్నరాణి, గడ్డమణుగు లోయ, జి.కొండూరు మండలం
పాఠశాల లేకపోవడంతో చదువు మానేశా..
గతంలో మా ఇళ్ల దగ్గరే ఉండే పాఠశాలలోనే ఏడో తరగతి వరకు చదువుకున్నా. ఆ తర్వాత నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి రావడంతో చదువు మానేసి పనులకు వెళ్తున్నా. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల ఏర్పాటు చేయాలి.
– రోహిత్, గడ్డమణుగు లోయ, జి.కొండూరు మండలం
Scholarship Program: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ‘కెనరా’ ఉపకార వేతనాలు