Skip to main content

Govt Diploma Colleges : ప్ర‌భుత్వ‌ డిప్లొమా క‌ళాశాల‌ల్లో జాబ్ మేళా..

Job mela at government diploma colleges for quick employment

తుమ్మపాల: పాలిటెక్నిక్‌ డిప్లొమా ద్వారా విద్యార్థులు త్వరగా స్ధిరపడుతున్నారని, ప్రభుత్వం డిప్లొమా కళాశాలల్లోనే జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తుందని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. రేబాకలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. కళాశాలలో తరగతి గదులను, ల్యాబ్‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.

School Inspection : పాఠ‌శాల‌లో ఆక‌స్మిక‌ త‌న‌ఖీ.. విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాలి..

ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఐవోటీ ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు నేర్పుతున్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాల మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. కలెక్టర్‌కు ప్రిన్సిపాల్‌ ఐ.వి.ఎస్‌.ఎస్‌.శ్రీనివాసరావు, అధ్యాపకులు పుష్పగుచ్ఛాలతో సాదరస్వాగతం పలికి కళాశాల అభివృద్ధి గురించి పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లా ప్రణాళిక అధికారి జి.రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Published date : 17 Aug 2024 03:37PM

Photo Stories