CM Stalin : ఆరవ తరగతి విద్యార్థినికి సీఎం ఫోన్..ఎందుకంటే...?
Sakshi Education
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరవ తరగతి విద్యార్థినికి ఫోన్ చేశారు.
కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను నవంబర్ 1 నుంచి తెరవనున్నట్లు ఆ అమ్మాయికి సీఎం స్టాలిన్ చెప్పారు. 'అయితే పాఠశాలకు వెళ్లేటపుడు టీచర్ సూచనలు పాటించండి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి' అంటూ సూచించారు.
నమ్మకలేకపోయాను..
కాగా, గతంలో తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో గల హొసూరులోని టైటాన్ టౌన్‌షిప్‌కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడో తెలుసుకోవడానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో తన ఫోన్ నెంబర్‌ను కూడా రాసింది. చిన్నారి లేఖ చదివిన సీఎం స్టాలిన్ తనకున్న బిజీ షెడ్యూల్‌లోనూ ప్రజ్ఞాకి ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై ప్రజ్ఞా మాట్లాడుతూ.. సీఎం తనతో ఫోన్‌లో మాట్లాడటాన్ని నమ్మకలేకపోయానని చెప్పింది.
Published date : 16 Oct 2021 12:40PM