Skip to main content

Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు.
MK Stalin son Udhayanidhi appointed  Deputy Chief Minister of Tamil Nadu

ఇందులో తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. సీఎం స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 28వ తేదీ స్టాలిన్‌ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు.

మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీని కూడా స్టాలిన్‌ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈయ‌న విద్యుత్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్‌లను స్టాలిన్‌ కేబినెట్‌లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్‌.మస్తాన్, కె.రామచంద్రన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు.

Women CMs: భార‌తదేశంలో సీఎం పీఠంపైకి ఎక్కిన 17 మంది మహిళలు వీరే..

Published date : 30 Sep 2024 06:39PM

Photo Stories