Show Cause Notice: హెచ్ఎంలకు షోకాజ్ నోటీసుల ఆదేశం
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు రెండవ దశ పనుల పురోగతిలో అలసత్వం వహించిన 141 మంది హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈవో, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాడు-నేడు పనులకు నిధులు ఉన్నప్పటికీ ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Free Courses for Woman: మహిళలకు ఉచితంగా ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సులు
గత 15 రోజులుగా నిధులు ఖర్చు చేయకుండా విధుల పట్ల అలసత్వం వహించిన 141 మంది హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈవో, సమగ్రశిక్ష ఏపీసీలను ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొన్ని పాఠశాలల్లో పనులు చేస్తున్నప్పటికీ బిల్లులు ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదని క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. సరైన సమాధానలు చెప్పని పలువురు ఎంఈవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.