Skip to main content

AP Education Syllabus : విద్యా సిలబస్‌లో మార్పులు చేయండిలా..

విద్యా రంగ నిపుణులు, మేధావులతో చర్చించి విద్యా శాఖలో, సిలబస్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబునాయుడు
Changes must be done in education syllabus for development says AP CM Chandrababu

అమరావతి: త్వరలో ప్రారంభించే ‘జన్మభూమి 2’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబునాయు డు అధికారులకు చెప్పారు. విద్యా రంగ నిపుణులు, మేధావులతో చర్చించి విద్యా శాఖలో, సిలబస్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు. విద్యా శాఖపై మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లలో తెలుగుకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థికీ కేంద్ర ప్రభుత్వ ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీ ఇవ్వాలన్నారు.

Teaching Jobs: మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పాఠశాలల్లో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లు నిర్వహించాలని, వీటిలో తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరవుతారని అన్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, స్పోర్ట్స్‌ రిపోర్ట్స్‌ కార్డ్స్‌ కూడా ఇవ్వాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్‌ ప్రోగ్రెస్‌ కార్డులో నమోదు చేయాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేయాలని చెప్పారు. జీవో నం.117పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూళ్లలో ఆయాల పెండింగ్‌ జీతాలు చెల్లించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి ఐవీఆర్‌ఎస్‌ విధానంలో అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. 

Glide Bomb: గ్లైడ్ బాంబ్ ‘గౌరవ్‌’ తొలి ప్ర‌యోగం స‌క్సెస్‌

డైట్‌ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యా శాఖలో నూతన విధానాలు, సంస్కరణలను వివరించారు. నైపుణ్య గణనపై అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల్లో 3.54 కోట్ల మంది పనిచేసే వయసున్న వారి నైపుణ్యాన్ని గణన చేయాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం 40 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరమని, 8 నెలలు పడుతుందని వివరించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన చేపట్టాలని సీఎం సూచించారు. 

Gurukula Vidyalayas: గురుకులాల్లో ఏసీబీ తనిఖీలు

రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా ఇండ్రస్టియల్‌ పార్కులు 
రాష్ట్రంలో ఓడరేవులు, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైనా సీఎం సమీక్షించారు. ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలన్నారు. 

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి ఇండస్ట్రియల్‌ పార్కును వెంటనే పునరుద్ధరించాలన్నారు. పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్‌ ఓడరేవులు అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్ర, రా్రõÙ్టతర ప్రాంత హింటర్‌ ల్యాండ్‌ అనుసంధానంతో కూడిన ఓడరేవుల నిర్మాణం ద్వారా ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 

Free Coaching: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

కరోనాకంటే గత ప్రభుత్వమే టూరిజాన్ని దెబ్బతీసింది 
ఏపీలో ఎకో, టెంపుల్, బీచ్‌ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు చెప్పారు. టూరిజం అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలన్నారు. కరోనాకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పర్యాటకం ఎక్కువగా దెబ్బతిందని అన్నారు. 

టీడీపీ గత ప్రభుత్వం ఐదేళ్లలో పర్యాటక రంగంపై రూ.880 కోట్లు ఖర్చు చేయగా.. గత ప్రభుత్వం రూ.213 కోట్లే ఖర్చు చేసిందన్నారు. కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ 20.6 శాతం నుంచి 2019–24 మధ్య 3.3 శాతానికి పడిపోయిందన్నారు. రుషికొండపై గత ప్రభుత్వం సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో నిరి్మంచిన ప్యాలెస్‌ను ఏం చేయాలన్న విషయంపై వివిధ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

C-DAC Recruitments : సీ–డ్యాక్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న 250 ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హ‌త‌లు ఇవే..

Published date : 14 Aug 2024 01:30PM

Photo Stories