School Teachers : ఉపాధ్యాయుల సర్దుబాటు అంతా అస్తవ్యస్తం.. కారణం!
శ్రీకాకులం: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్దుబాటు బెంగపట్టుకుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విలీనంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి నూతన విద్యా విధానంలో భాగంగా దీన్ని అప్పటి ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది తప్పిస్తే.. ఉపాధ్యాయులపై కక్షతో కాదు. ఈ విలీన ప్రక్రియను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికారపక్షమైన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సర్దుబాటు ప్రక్రియకు తెరలేపింది. దీంతో గత ప్రభుత్వం చేపట్టిన విలీన ప్రక్రియకు కూటమి ప్రభుత్వం పరోక్షంగా ఆమోదం తెలిపినట్లేనంటూ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు నేరుగా ఆక్షేపిస్తున్నారు.
Govt ITI Admissions : ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత ప్రవేశానికి దరఖాస్తులు.. ఈ తేదీల్లోనే..
టీఐఎస్‌లో ఇప్పటికే నిక్షిప్తం..
కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తీవ్ర ప్రభావం చూపినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం ఫేషియల్ అటెండెన్స్ యాప్‌లో టీచర్ల వివరాలను నమోదు చేయించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు ఉపాధ్యాయుల్ని ఖరారు చేశారు. మరోవైపు చాలా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మిగులు సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)లో వారి అదనపు విద్యార్హతను బట్టి సబ్జెక్టు టీచర్లుగా పంపించాలని నిర్ణయించారు. అయితే ఇది తాత్కాలికమా, శాశ్వతమా అన్న మాటకు ఇప్పటి వరకు జవాబు లేదు. వచ్చే జనవరిలో డీఎస్సీ–2024 నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు మళ్లీ ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయక తప్పదు.
MDS Admissions: ఎండీఎస్ వెబ్‌ఆప్షన్ల నమోదుకు రేపే చివరి తేది
సీనియారిటీ ఆధారంగా మిగులు నిర్ధారణ
మిగులు పోస్టుల నిర్ధారణలో కేడర్ (సర్వీస్) సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఇందులో జూనియర్లను మాత్రమే మిగులు టీచర్లుగా నిర్ణయిస్తారు. గతంలో సీనియర్ కోరుకుంటే వారిని సర్దుబాటు జాబితాలో చేర్చేవారు. ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా కేవలం కేడర్ జూనియర్‌ను మాత్రమే సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ ప్రక్రియను ఈ నెల 14వ తేదీలోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మిగులు పోస్టులపై జిల్లా విద్యాశాఖ అనేక కసరత్తులు చేసింది. మొత్తంమీద 1090 వరకు మిగులు టీచర్లు ఉన్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ సంఖ్య మారొచ్చు. ఏయే స్కూళ్లలో, ఏయే సబ్జెక్టులకు టీచర్లు అవసరమో ఖరారు చేసి, ఆ మేరకు మిగులు టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే కేడర్ సీనియార్టీ/ స్టేషన్ సీనియార్టీపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో ఈ తతంతం మరింత జాప్యంకానుంది. దీనికితోడు ఉపాధ్యాయులు బాయ్‌కాట్ చేయడంతో సర్దుబాటు ప్రక్రియ మరింత రసవత్తరంలో పడింది. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏపకక్ష నిర్ణయాలతో విద్యాశాఖ అడుగులు వేస్తుండటంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
President Medal: తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి అవార్డు
ఉపాధ్యాయ సర్దుబాటా.. మూసివేతా?
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రక్రియ చూస్తుంటే ప్రభుత్వ బడులను మూసివేసేలా కనిపిస్తోంది. ఇటీవల పదవీ విరమణలు, కొద్ది మంది ఉపాధ్యాయులు మృతిచెందడం వల్ల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. వీటి ని భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే తక్షణమే ప్రమోషన్లు కల్పించాలి.
– మజ్జి మదన్‌మోహన్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
Govt Jobs : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి..
అంతా గందరగోళంగా ఉంది
రాష్ట్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉపాధ్యాయ పని సర్దుబాటు ప్రక్రియంతా గందరగోళంగా, లోపభూయిష్టంగా ఉంది. ఒక పాఠశాలలో ఒకే క్యాడర్‌లో ఉన్న భాషోపాధ్యాయులను మిగులు ఉపాధ్యాయులుగా గుర్తించినప్పుడు డీఎస్సీ ర్యాంక్ ఆధారంగా గుర్తించాలి. పుట్టిన తేదీ ప్రకారంగా గుర్తించడంతో మంచిర్యాంకులో ఉన్న వారు ఇబ్బందులకు గురవుతారు. – పిసిని వసంతరావు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ అధ్యక్షుడు
TS TET 2024 ALERT : టెట్ రాసిన అభ్యర్థులు అలర్ట్.. అలాగే డీఎస్సీ అభ్యర్థులకు కూడా..