Govt Jobs : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి..

విజయనగరం: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు డిమాండ్ చేశారు. స్థానిక అమర్‌భవన్‌లో మంగళవారం నిర్వహించిన పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం పెరగడంతో విద్యార్థుల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయన్నారు.
Guest Lecturer Posts : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు..
విద్యార్థులందరూ గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో క్రమశిక్షణగా దేశ భవిష్యత్తును కాపాడాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.యుగంధర్. ఏఐవైఎఫ్ మన్యం జిల్లా విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీటీ నాయుడు, గోపినాయుడు, బూర వాసు, కోట అప్పన్న, రెండు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.