AP ITI Counselling: ఐటీఐలో రెండో విడత కౌన్సెలింగ్‌కు స్పందన
కంచరపాలెం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడుల్లో మిగులు సీట్ల భర్తీకి గురువారం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌ను ఉపాధి, శిక్షణ శాఖ ప్రిన్సిపాల్, కన్వీనర్ జె.శ్రీకాంత్ ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్‌లో 1 నుంచి 1069 ర్యాంక్ అభ్యర్థులు పాల్గొనగా 198 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. వారికి అధికారులు అర్హత పత్రాలు అందజేశారు. 1070 నుంచి 2,544 ర్యాంకుల అభ్యర్థులకు కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఒ రిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూ చించారు. కీర్తి, మాధవి, ఉమాశంకర్, ఎ.రమ ణ, హెచ్.ఎన్.శ్రీనివాసరావు, వంటాకుల శ్రీనివాసరావు కౌన్సెలింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.