Skip to main content

Statistics Exam: ‘స్టాటిస్టిక్స్‌’ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

Joint Andhra Pradesh Coordinator of Examination   Statistics Olympiad Prelims Exam  Register for Statistics Exam    Dr. B. Srinivas, Principal of Manuguru Government Degree College

మణుగూరు రూరల్‌ : ఈనెల 28, ఫిబ్రవరి 3, 4 తేదీల్లో సీఆర్‌ రావు ఏఐఎంఎస్‌సీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్టాటిస్టిక్స్‌ ఒలంపియాడ్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పరీక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కో ఆర్డినేటర్‌, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి. శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జూనియర్‌ లెవల్‌లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు, సీనియర్‌ లెవల్‌లో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్టాటిస్టిక్స్‌ ఒలంపియాడ్‌ వెబ్‌ సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుని పరీక్షలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతిభ కనబర్చిన వారిలో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.15 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు, ఐదో బహుమతి రూ.5వేల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: Teachers: ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలి

Published date : 20 Jan 2024 11:40AM

Photo Stories