Teachers: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
Sakshi Education
నిర్మల్ రూరల్: ఇన్ సర్వీస్ టీచర్లకు పదోన్నతుల విషయంలో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ కోరారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ)నిబంధనల్లో 2010 తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు ఇది కనీస అర్హతగా మాత్రమే ఉందని గుర్తు చేశారు. అంతకుముందు నియామకమైన ఉపాధ్యాయులకు నోటిఫికేషన్లలో గానీ, నియామకపు పత్రాలలోగానీ టెట్ షరతులు విధించలేదని తెలిపారు. టెట్ నిబంధనపై స్పష్టత లేక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.
చదవండి: SMC Elections: ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు
Published date : 20 Jan 2024 12:06PM