Skip to main content

Open School Exams: రేప‌టి నుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు..

ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు జూన్‌ 1 నుంచి నిర్వహిస్తున్నట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి ప్ర‌క‌టించారు..
Open tenth and intermediate exams from tomorrow  Open School Coordinator Lakshminarayana statement

నంద్యాల: జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్టినేటర్‌ లక్ష్మినారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ 10 నుంచి 12 వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్‌ స్కూల్‌ విడుదల చేసిందన్నారు. అభ్యర్ధులు https://apopenschool.ap.gov.in వెబ్‌ పోర్టల్‌లో డౌన్‌లోడ్‌ చేసకోవచ్చన్నారు. జిల్లాలో పదో తరగతి నాలుగు సెంటర్లు, ఇంటర్‌ మూడు సెంటర్లలో పరీక్షలు జరుగనున్నాయన్నారు.

CBSE Syllabus: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భ‌విష్య‌త్తు..

Published date : 31 May 2024 05:27PM

Photo Stories