Govt Schools: విద్యార్థినులకు నాదస్వర పోటీలు
Sakshi Education
వేలూరు: తిరుపత్తూరు జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులు విభిన్న ప్రతభను వెలికి తీసే విధంగా కళాఉత్సవాలు నిర్వహించి తవిల్, నాదశ్వర పోటీలను నిర్వహించారు. తిరుపత్తూరు మీనాక్షి ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో నిర్వహించిన ఈ పోటీలను కలెక్టర్ భాస్కర పాండియన్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ఆర్ట్ ఫెస్టివెల్ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. జిల్లా స్థాయిల్లో గెలుపొందిన విద్యార్థినులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థినులు తవిల్, సంగీతం వంటి పోటీల్లో పాల్గొని పలువురిని అలరించారు. ఎమ్మెల్యేలు దేవరాజ్, నల్లతంబి, విద్యాశాఖ సీఈఒ మునిసుబ్రమణి పాల్గొన్నారు.
చదవండి: School Games: స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ప్రారంభం
Published date : 28 Oct 2023 03:19PM