School Games: స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ప్రారంభం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 15 నియోజకవర్గాలకు సంబంధించి కోకో, చెస్ అండర్ 14, అండర్ 17 బాల బాలికలకు జిల్లాస్థాయి సెలక్షన్స్ పోటీలు శుక్రవారం తాడేపల్లిగూడెం తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. వైఎస్సార్‌సీపీ నేత కొట్టు విశాల్ పోటీలను ప్రారంభించారు. 720 మంది ఖో ఖో క్రీడాకారులు, 350 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. సభకు హైస్కూల్ హెచ్‌ఎం మైనం సత్యనారాయణ అధ్యక్షత వహించగా డీవైఈఓ రవీంద్ర భారతి, తాడేపల్లిగూడెం, పెంటపాడు ఎంఈఓలు జ్యోతి, టీవీ రామకృష్ణలు హాజరయ్యారు. కొట్టు విశాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం, మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కృషి చేస్తున్నారన్నారు. జిల్లా ఎస్‌జీఎఫ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సెక్రటరీ ఖుద్దూస్, స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ రామకృష్ణ, పీడీలు చింతకాయల సత్యనారాయణ, కట్టా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: CBSE: సీబీఎస్‌ఈ విధానంపై అవగాహన తరగతులు
ఖో ఖో అండర్–17 విజేతలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 నియోజకవర్గాలకు సంబంధించి శుక్రవారం తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఖో ఖో అండర్–14, 17, చెస్ పోటీలకు సెలెక్షన్స్ జరిగాయి. అండర్–17 ఎంపికలను శుక్రవారం రాత్రి వెల్లడించారు. బాలురు విభాగంలో బి.వినయ్ (గొల్ల్లమడుగు), పి.జే.నాగ కళ్యాణ్ (లక్కవరం), పి.చందు (కె.గోకవరం), బి.శ్యామ్ (భీమవరం), జి.రాజు (జంగారెడ్డిగూడెం), బి.వీరేంద్ర (పెదపాడు), ఎస్.జే.నర్శింహరాజు (రాజవరం). ఎం.సాయి సంతోష్ (బొర్రెంపాలెం), వి.దుర్గా ప్రసాద్ (మోగల్లు), ఎస్‌కేఎస్ ప్రసాద్ (మోగల్లు), డి.లోకేష్ (లక్కవరం), సీహెచ్ రమణేష్ (పాలకోడేరు), కె.వంశీ (అనాకోడేరు), కె.చైతన్య (సిద్ధాపురం), ఎంవీ అనిల్‌కుమార్ (యర్నగూడెం), బి.సాయి (బొర్రెంపాలెం), కేబీఎన్‌వీ శ్రీహర్ష (ఇరగవరం), బాలికల విభాగంలో బుట్టాయిగూడెంకు చెందిన యూ.నక్షత్ర, ఎస్.సంజనా, కె.హారిక, కె.కీర్తన, సీహెచ్ వెంకట శివ, కె.దివ్యలు ఎంపిక కాగా, పి.గాయిత్రి (భీమవరం), ఎస్.సింగ భవాని (రామన్నపాలెం), కె.దీక్షిత (భీమవరం), పి.పద్మశ్రీ (సీతానగరం), యామిని సాయిశ్రీ (లక్కవరం), భువనేశ్వరి (రామన్నపాలెం), డి.నిఖిత శ్రీశాంతి (త్యాజంపూడి), ఎన్.సాయి లక్ష్మి (సీతానగరం), వై.తులసి (రాజవరం)లను ఎంపిక చేశారు.