CBSE: సీబీఎస్‌ఈ విధానంపై అవగాహన తరగతులు
Sakshi Education
శ్రీకాకుళం రూరల్: సీబీఎస్‌ఈ విధానం, సిలబస్‌పై మండల పరిధిలోని పెదపాడులో గల అంబేడ్కర్ బాలికల గురుకులంలో ఈ నెల 26, 27 తేదీల్లో అవగాహన సదస్సులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ జ్యోతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో గల 9 ప్రభుత్వ అంబేడ్కర్ గురుకుల పాఠశాల్లో 6 నుంచి 9 వ తరగతి వరకూ సిబిఎస్‌ఈ సిలబస్ జరుగుతోందని, దీనిపై విద్యార్థులకు ఎలా బోధించాలన్న విషయంపై వెన్నెలవలసకు చెందిన నవోదయ, పెదపాడుకు చెందిన కేంద్రీయ విద్యాలయం ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, ఆర్‌కే యాదవ్‌లు వివరించినట్లు తెలిపారు. 2025 నాటికి అన్ని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ ద్వారానే పరీక్షలు జరుగుతాయని ఆమె వివరించారు.
చదవండి: Open School: పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ
Published date : 28 Oct 2023 01:31PM