Kalam World Records: నాలుగేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డ్స్‌లో చోటు.. ఈ బుడతడి టాలెంట్ తెలిస్తే..
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): యూకేజీ చదువుతున్న వడ్డే ధనుష్ పిట్టకొంచెం.. కూత ఘనం మాదిరిగా తన సత్తా చాటాడు. నాలుగేళ్ల వయస్సులో వివిధ అంశాల్లో ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పి కలాం బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. జూన్ 29న ఈ పరీక్ష నిర్వహించగా.. రికార్డు సాధించినట్లు గుర్తింపు పత్రాన్ని సోమవారం బాలుడికి అందించారు.
వివరాలు ఇవి.. మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామానికి చెందిన వడ్డే నరేష్, లక్ష్మీప్రసన్న కుమారుడు ఏడాది వయస్సు నుంచే ప్రతి విషయం తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చేవాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కొండపల్లికి వచ్చి డీఏవీ పాఠశాలలో చేర్పించారు.
National Scholarship: నేషనల్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
శ్లోకాలు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, రాజధానులు, రామాయణ పాత్రలు, జాతీయ చిహ్నాలు, శరీరభాగాలు, అంకెలు, జనరల్ నాలెడ్జ్, జంతువులు, పండ్ల పేర్లు నెలలు, వాహనాలు, ఆంగ్లవర్ణమాల, వారాలు, ఉగాది షడ్రుచుల అర్థాలు అడిగిన వెంటనే తడుముకోకుండా చెప్పి ప్రపంచ కలాం బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. గతంలో ఏడాదిన్నర వయస్సులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.