6th Class Entrance Exam: 20న నవోదయ ప్రవేశ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2024–25 సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 20న పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుందని, జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. కొత్తగూడెం–3, భద్రాచలం–2, ఇల్లెందు–2, బూర్గంపాడు, అశ్వారావుపేటలలో ఒక్కోటి చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా నుంచి 1,325 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు పొందాలని, గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. వివరాలకు ఏసీజీఈ ఎస్.మాధవరావును 99890 27943 నంబరులో సంప్రదించాలని కోరారు.
చదవండి: Collector Jitesh V Patil: నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
Tags
- JNVST
- JNVST Class-VI admission
- JNVST 2024
- 6th Class Entrance Exam
- Entrance Exams
- Navodaya Vidyalaya Samiti
- Navodaya Vidyalaya Samiti admissions
- Navodaya Vidyalaya Selection Test 2024
- Education News
- Telangana News
- JawaharNavodayaVidyalaya
- CommonAdmissionTest
- Latest admissions
- sakshi education admissions