Skip to main content

Holidays : జ‌న‌వ‌రి 15వ తేదీ వరకు స్కూల్స్‌ బంద్‌.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఉత్తరాదిని రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి.ప్రజలకు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
Holidays
Schools Holidays

కనిష్ఠంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇది గడిచిన రెండేళ్లలో జనవరి నెలలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఈ నేపథ్యంలో ఇక్క‌డ స్కూల్స్‌ల‌ను జనవరి 15వ తేదీ వరకు స్కూళ్లను మూసివేశారు. ఈ మేర‌కు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే స్కూళ్లను మూసివేయాలని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు విద్యాశాఖ నోటీసులను కూడా ఇచ్చింది. 

Sankranthi Holidays : జ‌న‌వ‌రి 12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.. వీళ్ల‌కు మూడు రోజులు మాత్ర‌మే..

ఆ తరువాత కూడా మూడు రోజుల పాటు..

School Holidays latest news in telugu

ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉన్న ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత కూడా మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు నెలకొని ఉంటుందని వెల్లడించింది. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర మధ్యప్రదేశ్, బీహార్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలలో వచ్చే 2-3 రోజులలో దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Sankranthi Holidays 2023 : తెలంగాణ‌లో సంక్రాంతి సెల‌వులు ఇవే.. ఏపీలో మాత్రం భారీగానే..

Published date : 10 Jan 2023 03:04PM

Photo Stories