Internship Certificates: ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల అందజేత
Sakshi Education
కరీంనగర్: హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న నగరంలోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాల ఫుడ్ సైన్స్ విద్యార్థులకు ఏప్రిల్ 16న కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్లు అందజేశారు.
ఈ సందర్భంగా సాకేత్ రామారావు మాట్లాడుతూ ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ డిగ్రీ, పీజీ విద్యార్థులకు యేటా వివిధ కంపెనీలు, ఆస్పత్రుల్లో ఇంటర్న్‌షిప్ కల్పిస్తూ ఉద్యోగాలు అందిస్తున్నామన్నారు.
చదవండి: New Education Plan: కోర్సుతో కొలువు..! సరికొత్త విద్యా ప్రణాళిక
హైదరాబాద్‌లోని మోడ్రన్ ఫుడ్స్, బేక్మెట్, తెలంగాణా ఫుడ్స్, తునవ్ ఫుడ్స్, క్రౌన్ బీర్, కరీంనగర్ డెయిరీ, విజయ డెయిరీలతో పాటు పలు కంపెనీల్లో కళాశాలలోని డిగ్రీ విద్యార్థులు 45 రోజులు, పీజీ విద్యార్థులు 90 రోజులు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ అర్జున్‌రావు, విభాగాధిపతి మహేశ్, అధ్యాపకులు అంజలి, ప్రణయ, సంపత్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
Published date : 17 Apr 2024 02:09PM